Author: admin

  • Jagan:

    Jagan:

    వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ గుంటూరు చేరుకున్నారు. గిట్టుబాటు ధ‌ర లేక ఇబ్బందులు ప‌డుతున్న మిర్చి రైతుల‌ను క‌ల‌వ‌నున్నారు. అనంత‌రం మిర్చి మార్కెట్ యార్డును సంద‌ర్శించ‌నున్నారు. జ‌గ‌న్ రాక‌తో ఎన్నిక‌ల నిబంధ‌న‌లు ఉన్నా వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. అడుగ‌డుగున జ‌గ‌న్ కు నీరాజ‌నాలు ప‌డుతున్నారు.

    అయితే మ‌రో ప‌క్క ఎన్నిక‌ల కోడ్ ఉండ‌టంతో మిర్చి యార్డులో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి నిరాక‌రించారు పోలీసులు. మిర్చి యార్డులో రాజ‌కీయ ఫొటోలు, ఫ్లెక్సీలు, స‌మావేశాలు నిషేధం అంటూ ఇప్ప‌టికే మైకులో ప్ర‌చారం చేశారు. అనుమ‌తులు లేకుండా వ‌స్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

    ఇక దీనిపై కౌంట‌ర్ ఇచ్చారు వైసీపీ నేత‌లు. ఏపీలో రైతుల ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్నారు. రాష్ట్రంలో పండించే ఏ పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేద‌న్నారు. రైతుల‌కు భ‌రోసా క‌ల్పించేందుకే జ‌గ‌న్ ఈ ప‌ర్య‌ట‌న చేప‌ట్టార‌ని చెప్పారు. కానీ నిత్యావ‌స‌ర‌ స‌రుకులు రేట్లు మాత్రం పెరిగిపోయాయ‌ని చెప్పారు.

    కూట‌మి ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు రైతులు. ప్ర‌భుత్వం ఇచ్చే మ‌ద్ద‌తు ధ‌ర స‌రిపోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎక‌రాకు ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు న‌ష్ట‌పోతున్నామ‌ని చెప్పారు. గిట్టుబాటు ధ‌ర‌పై అధికారులు వాస్త‌వాలు తెలుసుకోకుండా ప్ర‌భుత్వానికి నివేదిక ఇచ్చార‌న్నారు. త‌మ గోడు చెప్పుకోవ‌డానికి ఒక్క‌రూ కూడా రావ‌డం లేద‌ని బాధ‌ప‌డ్డారు. ఈ ప్ర‌భుత్వానికి రైతుల‌పై అవ‌గాహ‌న లేద‌న్నారు.

  • Dr. BR Ambedkar:

    Dr. BR Ambedkar:

    ఆయ‌న అణ‌గారిన వ‌ర్గాల బ‌తుకులు మార్చారు.
    ఆయ‌న మూగ‌బోయిన గొంతుల‌కు ఊపిరి పోశారు.
    ఆయ‌న అంట‌రానిత‌నాన్ని రూపుమాపారు.
    ఆయ‌న కుల వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా పోరాడారు.
    ఆయ‌నే రాజ్యాంగ నిర్మాత‌ బీఆర్ అంబేద్క‌ర్‌.

    బీఆర్ అంబేడ్క‌ర్‌.. పూర్తి పేరు భీంరావ్ రాంజీ అంబేడ్క‌ర్. ఆయ‌న మహ‌ర్ కులానికి చెందిన వారు. అంబేద్క‌ర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లో జ‌న్మించారు. ద‌ళితుడు అనే కార‌ణంతో ఆయ‌న‌ చిన్న‌త‌నంలోనే అనేక అవ‌మానాలు ఎదుర్కొన్నారు. కులవివ‌క్ష కార‌ణంగా ఒకానొక‌ స‌మ‌యంలో క‌నీసం ఆయ‌న‌కు తాగ‌డానికి మంచినీరు కూడా ఇవ్వ‌లేదు. అంతేకాకుండా ప‌క్క‌నే ఉన్న మురికి గుంట‌లో ఉన్న నీరు తాగు అని అవ‌మానించారు. ఏదైనా తాకితే అది మైలుప‌డుతుంద‌ని అంబేడ్క‌ర్‌ను దూరంగా ఉంచేవారు. చివ‌రికి ఆయ‌న ఉండేందుకు ఇల్లు కూడా అద్దెకు ఇవ్వ‌లేదు. చేసేది ఏమీ లేక ఒక స‌త్రంలో ఉండేవారు. అంబేద్క‌ర్ మహ‌ర్ కులానికి చెందిన వారు అని తెలిసి అక్క‌డ నుంచి కూడా పంపేశారు.

    ఎన్నో ఘోర అవ‌మానాలు ఎదుర్కొన్న అంబేడ్క‌ర్ 1927 నుంచి అంట‌రానిత‌నానికి వ్య‌తిరేకంగా ఉద్య‌మాలు చేయ‌డం మొద‌లుపెట్టారు. ఆ త‌ర్వాత ద‌ళితుల మ‌హా స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌కు దేశం న‌లుమూల‌ల నుంచి వేలాదిగా ద‌ళితులు త‌ర‌లివ‌చ్చారు. బ‌డిలోకి, గుడిలోకి ద‌ళితులు వెళ్లేందుకు పోరాటం చేశారు. అట్ట‌డుగు వ‌ర్గాల సేవ కోసం బోధించు, స‌మీక‌రించు, పోరాడు అనే సిద్ధాంతాల‌తో అంట‌రానిత‌నం, కుల‌మ‌తాలు లేని స‌మాజం కోసం కృషి చేశారు. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత‌ కేంద్రంలో మొట్ట‌మొద‌టి న్యాయ‌శాఖ మంత్రిగా ప‌ని చేశారు. అంతేకాకుండా భార‌త రాజ్యాంగం రాసే అవ‌కాశం ద‌క్కింది.

    వివిధ ర‌కాల భాష‌లు, ఆచారాలు, కులాలు, మ‌తాలు ఉన్న ఈ దేశం ఆయ‌న రాసిన రాజ్యాంగంతోనే ఇప్పుడు న‌డుస్తోంది. ఆయ‌న కేవ‌లం ద‌ళితుల కోస‌మో, రిజ‌ర్వేష‌న్ల కోస‌మో మాత్ర‌మే కాకుండా మ‌హిళ‌లు, పురుషుల‌కు స‌మాన జీతాలు, ప‌ని స‌మ‌యాన్ని 12 ఉంచి 8 గంట‌లు చేయాల‌ని, స్రీల‌కు ఆస్తి హ‌క్కు క‌ల్పించాల‌ని పోరాడారు. ఆయ‌న పూనుకోపోతే ఇప్ప‌టికీ బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల బ‌తుకులు చీక‌టిలోనే మ‌గ్గిపోయేవి. అందుకే అంబేడ్క‌ర్‌ చేసిన సేవ‌ల‌కు గాను భార‌త ప్ర‌భుత్వం 1990లో భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించింది. ది గ్రేటేస్ట్ ఇండియ‌న్‌గా పేరుపొందారు.

    అంబేడ్క‌ర్ మ‌ర‌ణించినా.. భార‌త‌ రాజ్యాంగం వ‌ల్ల‌ అన‌గారిన వ‌ర్గాల చీక‌టి బ‌తుకుల్లో వెలుగులు నిండాయి. బానిస‌త్వం న‌సించి దేవాల‌యాలు, విద్యాల‌యాల్లో పేద‌లు ప్ర‌వేశించి ఉన్న‌త చ‌దువులు చ‌దువుకుంటున్నారు. అంట‌రానిత‌నాన్ని త‌రిమికొట్టి మూగ‌బోయిన గొంతుల‌కు అంబేడ్క‌ర్‌ జీవం పోశారు. అందుకే వేలాది మంది గుండెల్లో ఆయ‌న దేవుడిగా కొలువై ఉన్నారు.

  • Latest News

                                            Dr. BR Ambedkar: వాడ‌వాడ‌లా ఘ‌నంగా అబేంద్క‌ర్...

  • Hello2

    Test template with wordpress

  • Hello world!

    Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!